Harish Rao: 30 వేల మొక్కలు నాటిన మంత్రి హరీష్ రావు, అధికారులు
Harish Rao: రాష్ట్ర హరితహారంలో సిద్ధిపేట రెండవ స్థానంలో నిలిచిందన్న మంత్రి
Harish Rao: 30 వేల మొక్కలు నాటిన మంత్రి హరీష్ రావు, అధికారులు
Harish Rao: హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 273.33 కోట్ల మొక్కలు నాటి, దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డులో నిలిచిందని మంత్రి హరీష్ అన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమంతో పాటు సీఎం కేసీఆర్ హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు. తెలంగాణ హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలోనే సిద్ధిపేట జిల్లా రెండవ స్థానంలో నిలిచిందని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో పచ్చదనం ఇప్పటికే 28 శాతానికి చేరిందని, మరో 5 శాతం సాధిస్తే 33 శాతం గ్రీనరీ ఉన్న రాష్ట్రంగా దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా సిద్ధిపేట శివారు రంగనాయక సాగర్ తెలంగాణ తేజోవనంలో అధికారులతో కలిసి 30 వేల మొక్కలు నాటారు. అనంతరం ఆర్ట్ గ్యాలరీ సందర్శించారు.