Harish Rao: కాంగ్రెస్ చేసే డిక్లరేషన్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
Harish Rao: ఎంపీ బండి సంజయ్ వారాల గురించి చెప్పడమే గానీ.. ప్రధాని మోడీ నుంచి వరాలు తీసుకురాలేరని
Harish Rao: కాంగ్రెస్ చేసే డిక్లరేషన్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
Harish Rao: బీజేపీ, కాంగ్రెస్‌లపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ చేసే డిక్లరేషన్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో డిక్లరేషన్‌లు అమలు చేయాలన్నారు. ఎంపీ బండి సంజయ్ వారాల గురించి చెప్పడమే గానీ.. మోడీ నుంచి వరాలు తీసుకురాలేరని ఆయన విమర్శించారు. బీజేపీ నాయకులు వారాల పేరిట సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి హరీష్‌రావు అన్నారు