Harish Rao: కేసీఆర్‌ అంటే నమ్మకం.. కాంగ్రెస్‌ అంటే నాటకం

Harish Rao: ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ అంటోంది.. 11 సార్లు గెలిచి ఏం చేశారు..?

Update: 2023-10-28 08:54 GMT

Harish Rao: కేసీఆర్‌ అంటే నమ్మకం.. కాంగ్రెస్‌ అంటే నాటకం

Harish Rao: కేసీఆర్‌ అంటే నమ్మకమని, కాంగ్రెస్‌ అంటే నాటకమని విమర్శనాస్త్రాలు సంధించారు మంత్రి హరీష్‌రావు. ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ అంటోందని, 11 సార్లు గెలిచి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కనీసం మంచినీళ్ల గోస కూడా తీర్చలేదన్నారు. రాష్ట్రంలో 3 గంటల కరెంట్‌ చాలని కాంగ్రెస్‌ అంటోందని, మహారాష్ట్రలో వ్యవసాయానికి 7 గంటల కరెంట్‌ ఇస్తున్నారని ఆయన గుర్తుచేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ 5 గంటల కరెంటే ఇస్తామంటోందని, 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీష్‌రావు అన్నారు. రైతుబంధు సృష్టికర్త సీఎం కేసీఆర్‌ అన్న హరీష్‌రావు.. రైతుకే డబ్బులు ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్‌ అని అన్నారు.

Tags:    

Similar News