Harish Rao: బీజేపీలో చేరడమంటే ఆత్మహత్య చేసుకున్నట్టే

Harish Rao: ఖమ్మం జిల్లాలో మతోన్మాద పార్టీలకు స్థానం లేదు

Update: 2023-01-16 10:31 GMT

Harish Rao: బీజేపీలో చేరడమంటే ఆత్మహత్య చేసుకున్నట్టే

Harish Rao: ఈసారి కాంగ్రెస్ పని ముగిసినట్టేనని, బీజేపీలో చేరితే ఆత్మహత్య చేసుకున్నట్టేనని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. మతతత్వ పార్టీలకు ఖమ్మంలో ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. ముచ్చటగా మూడోసారి కూడా తమదే విజయం అని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఈనెల 18న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ క్రమంలో ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించిన మంత్రి హరీశ్ రావు.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి హరీష్‌రావు చెప్పారు.

Tags:    

Similar News