TS High Court: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిందే
TS High Court: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
TS High Court: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిందే
TS High Court: గ్రూప్-1 పరీక్షపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. పరీక్ష రద్దును డివిజన్ బెంచ్ సమర్థించింది. గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్- 1 ప్రిలిమ్స్ రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది.