TS Municipal Elections 2021: వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విషాదం
TS Municipal Elections 2021: పోలింగ్ సెంటర్‌లో మృతి చెందిన ఉపాధ్యాయుడు
కార్పొరేషన్ ఎన్నికల్లో విషాదం
Telangana: రాష్ట్రంలో పురపోరు ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విషాదం చోటుచేసుకుంది. 57వ డివిజన్‌లోని సమ్మయ్య నగర్ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు రమేష్‌బాబు.. గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే మున్సిపాలిటీల్లో జోరుగా ఓటింగ్ కొనసాగుతున్నప్పటికీ.. కార్పొరేషన్లలో కాస్త నెమ్మదించింది.