100వ జన్మదిన వేడుకలు జరుపుకున్న బామ్మ జమ్ముల శశిరేఖమ్మ
Khammam: కుటుంబసభ్యుల మధ్య 100వ జన్మదిన వేడుకలు జరుపుకున్న బామ్మ
100వ జన్మదిన వేడుకలు జరుపుకున్న బామ్మ జమ్ముల శశిరేఖమ్మ
Khammam: నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించే వాళ్లు అరుదుగా ఉంటారు. అలా నూరేళ్లు నిండినా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో నాలుగు తరాల మనవళ్లు మనరాళ్ల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకుంది ఓ భామ్మ. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగలిగొండ గ్రామానికి చెందిన జమ్ముల శశిరేఖమ్మ 100వ జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఎవరి మీద ఆధారపడకుండా తన పని తాను చేసుకుంటూ ఆరోగ్యం జీవిస్తుంది బామ్మ. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు. నాలుగు తరాల కుటుంబ సభ్యులు మొత్తం 25 మంది. సమయానికి తింటూ, కష్టపడి పని చేస్తే జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చని తన అనుభవాలను మనవళ్లు, మనవరాళ్లతో పంచుకున్నారు జమ్ముల శశిరేఖమ్మ.