నకిరేకల్‌లో దారుణ హత్య: కుటుంబ కలహాలతో మేనమామను చంపిన అల్లుడు

నల్గొండ జిల్లా నకిరేకల్ లో దారుణం కుటుంబ కలహాలతో మేనమామను హత్య చేసిన అల్లుడు మృతుడు కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్న ఎలగందుల వెంకన్న

Update: 2025-12-22 05:50 GMT

నకిరేకల్‌లో దారుణ హత్య: కుటుంబ కలహాలతో మేనమామను చంపిన అల్లుడు

 నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాలు ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. తిప్పర్తి రోడ్డులో నివాసం ఉంటున్న కోడిగుడ్ల వ్యాపారి ఎలగందుల వెంకన్నను అతని మేనల్లుడు దారుణంగా కొట్టి హత్య చేశాడు. తండ్రికొడుకుల మధ్య గోడవలను పరిష్కరిస్తానంనంటూ పిలిచిన వెంకన్నను అతని కుమారుడు రాకేశ్ పై తీవ్ర స్థాయిలో దాడి చేశాడు. దాడిలో వెంకన్న అక్కడికక్కడే చనిపోగా.. అతని కొడుకు రాకేశ్ కు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్ారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీ అయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరొకరిని ఆసుపత్రి పాలు చేశాయి. పట్టణంలోని తిప్పర్తి రోడ్డులో నివాసం ఉంటున్న కోడిగుడ్ల వ్యాపారి ఎలగందుల వెంకన్నను అతని మేనల్లుడు శ్రీకాంత్ పాల డబ్బాతో కొట్టి అతి దారుణంగా హత్య చేశాడు.తండ్రీకొడుకుల మధ్య ఉన్న గొడవలను పరిష్కరిస్తానని పిలిచిన శ్రీకాంత్, మాట మాట పెరగడంతో ఒకసారి గా వెంకన్నతో పాటు అతని కుమారుడు రాకేష్‌పై తీవ్రస్థాయిలో దాడికి తెగబడ్డాడు.ఈ దాడిలో వెంకన్న అక్కడికక్కడే ప్రాణాలు వదలగా,రాకేష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం రాకేష్ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.నిందితుడు శ్రీకాంత్ పాత నేరస్తుడు, పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు ఉన్నాయి.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానితుడిని ఒకరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News