Liquor: మద్యం కోసం మనవడి అమ్మకం.. తాత అరాచకం.. విలవిలలాడుతున్న కన్నపేగు

తాతయ్య పేరుకే అతడు కళంకితుడు..మద్యం కోసం..రోజుల పసికందును అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో పూటుగా మద్యం తాగేశాడు. సొంత కూతురుకే కడుపుకోత మిగిల్చిన ఓ తండ్రి కథ ఇది. హైదరాబాద్ లో జరిగిన ఈ దారుణ ఘటన..

Jyothi
Published on: 17 May 2023 3:02 PM IST
Grandfather Sold His Grandson For Alcohol In Hyderabad
X

Liquor: మద్యం కోసం మనవడి అమ్మకం..తాత అరాచకం..విలవిలలాడుతున్న కన్నపేగు

Liquor: తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలే కాదు నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాల్లో 70 నుంచి 85 శాతం మద్యం మత్తులో జరుగుతున్నాయి. మత్తుకు బానిసలుగా మారి సొంతవారినే కడతేర్చుతున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తున్నాయి. తాజాగా అలాంటి ఘోరమైన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీమ్ పేటలో నివాసముంటున్న ఖలీల్ మద్యానికి బానిస. ఎలాంటి పనిచేయకుండా మద్యం తాగుతూ డబ్బుల కోసం ఇంట్లోవారిని వేధించడం ఖలీల్ నిత్యకృత్యం. ఈ క్రమంలోనే ఖలీల్ కూతురు ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. ఈమధ్యే పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఇదిలాఉంటే, మద్యానికి ఇంట్లోవాళ్లు డబ్బులు ఇవ్వకపోవడంతో రోజుల వయసుస్న పసికందును ఎత్తుకెళ్లి అమ్మేసి వచ్చిన డబ్బుతో మద్యం తాగేశాడు.

చిన్నారి కనిపించకపోయేసరికి ఖలీల్ కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖలీల్ ను అదుపులోకి తీసుకొని..చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story