మూడో రోజు పర్యటనలో గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మూడు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీ చేరుకున్నారు.

Update: 2019-12-11 04:11 GMT
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మూడు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీ చేరుకున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి అక్కడి నుంచి మంథని మీదుగా గోదావరిఖని చేరుకోవాల్సి ఉండగా అక్కడి రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉండడంతో గవర్నర్‌ ప్రయాణించే రూట్‌ మ్యాప్ ను మార్చారు. దీంతో అన్నారం బ్యారేజీని పరిశీలించిన తరువాత చెన్నూరు మండలం సుందరశాల మీదుగా చెన్నూరు, భీమారం, జైపూర్‌ మీదుగా గోదావరిఖనికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి ఎన్టిపీసీలో బస చేసిన గవర్నర్ బుధవారం ఉదయాన్నే మూడో పర్యటనను ప్రారంభించనున్నారు.  

ఇక మూడో రోజు పర్యటన షెడ్యూల్ ను చూసుకుంటే ఉదయం 8 గంటలకు ఎన్టీపీసీ స్పందన క్లబ్‌లో నిర్వహించే బాలికల కరాటే పోటీలను సందర్శించనున్నారు. అనంతరం అక్కడి నుంచి గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించే కళరీపయట్టు కరాటే ప్రదర్శనలను 9 గంటల నుంచి 9.30 వరకు తిలకించనున్నారు. 9.45 నుంచి 10.15 వరకు బసంత్‌నగర్‌ రూట్‌లో రామగుండం కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌ ను సందర్శించనున్నారు.

తదుపరి ఉదయం 10.15 నుంచి 10.30 వరకు బసంత్‌నగర్‌లోని ఎస్‌హెచ్‌జీ మహిళలు తయారు చేసిన జ్యూట్‌ బ్యాగుల కేంద్రాన్ని సందర్శించి అక్కడున్న మహిళలతో ముచ్చటించనున్నారు. అనంతరం మహిళా స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో సబల శానిటరీ నాపికిన్స్‌ తయారు చేసే కేంద్రాన్ని 10.30 నుంచి 10.45 వరకు పరిశీలించనున్నారు. 10.45 నుంచి 12 గంటల వరకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి స్వగ్రామం కాసులపల్లి గ్రామంలోని స్వచ్చత పరిశీంచి గ్రామస్తులతో వారి సమస్యల గురించి మాట్లాడనున్నారు. 12 నుంచి 1.30 గంటల వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ధర్మారం మండలంలోని నందిమేడారం 6వ ప్యాకేజీ ప్రాజెక్టును సంర్శించనున్నారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన భోజనాలకు మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకు కొనసాగించనున్నారు. భోజన కార్యక్రమంలో ముగిసిన తరువాత మధ్యహానం 2.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేయనున్నారు.ఈ పర్యటనలో భాగంగా గవర్నకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లను అధికారులు చేశారు. 

Tags:    

Similar News