ప్రపంచమంతా క్రిస్మస్ సందడి.. కనువిందు చేస్తున్న చర్చిలు

విద్యుత్తు కాంతులతో మెదక్‌ చర్చి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌

Update: 2021-12-25 01:30 GMT

విద్యుత్తు కాంతులతో మెదక్‌ చర్చి 

Christmas: క్రిస్మస్‌ వేడుకలకు రాష్ట్రంలోని చర్చిలు సిద్ధమయ్యాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మెదక్‌ కెథడ్రల్‌ చర్చిలో 3 రోజుల పాటు వేడుకలను నిర్వహించనున్నారు. ప్రధాన మందిరంలో క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని భక్తుల కళ్లకు కట్టేలా పశువుల పాకను నిర్మించారు. భారీ క్రిస్మస్‌ ట్రీని ఏర్పాటు చేసి, బెలూన్లు, విద్యుత్‌ దీపాలు, బొమ్మలు, గంటలు, గ్రీటింక్‌ కార్డులతో అలంకరించారు.

మెదక్‌ చర్చికి ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షకు పైగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు వసతి, తాగునీటి సౌకర్యం కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 500మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెల్లవారుజామున క్రైస్తవ గురువులు శిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి చర్చిలో ప్రతిష్ఠించారు. ప్రాతఃకాల ఆరాధనతో క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు జరిగే రెండో ఆరాధన తర్వాత భక్తులను లోనికి అనుమతిస్తారు. మెదక్‌ బిషప్‌ మోస్ట్‌ రెవరెండ్‌ ఏసీ సాల్మన్‌ రాజ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రాతఃకాల ఆరాధన సమయంలో భక్తులకు దైవ సందేశాన్ని ఇస్తారు.

Tags:    

Similar News