Telangana: గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని గుడ్డిగా వెళ్తే.. కృష్ణానదికి వెళ్లింది ఓ లారీ...!

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని గుడ్డిగా వెళ్తే.. కృష్ణానదికి వెళ్లింది ఓ లారీ. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

Update: 2025-12-17 05:23 GMT

Google Maps: గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని గుడ్డిగా వెళ్తే.. కృష్ణానదికి వెళ్లింది ఓ లారీ...!

ఏపీలోని బేతంచర్ల నుంచి తెలంగాణ మక్తల్‌కు బండల లోడుతో లారీ బయలుదేరింది. అయితే నేషనల్‌ హైవే మీదుగా కొత్తకోట వరకు వచ్చిన తర్వాత ఆత్మకూర్ నుంచి మక్తల్ వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ సహాయంతో ముందుకు సాగాడు లారీ డ్రైవర్ బాషా. ఈ క్రమంలో ఆత్మకూర్ చౌరస్తా చేరుకునే సరికి తెల్లవారుజాము అయ్యింది. అయితే చౌరస్తాలో టర్న్ తీసుకోవాల్సిన డ్రైవర్… గూగుల్ మ్యాప్ ప్రకారం నేరుగా వెళ్లాడు. అలా జూరాల గ్రామం వైపునకు ప్రయాణించాడు. గ్రామం దాటిన తర్వాత సైతం అలానే ముందుకు సాగాడు. ఇంతలోనే లారీ కుదుపులు ఎక్కువ కావడం… కొంత దూరంలోనే నీరు కనిపిస్తుండడంతో ఏదో అనుమానం కలిగింది. ఒక్కసారిగా లారీ నిలిపి దిగి చూడగా… దెబ్బకు లారీ డ్రైవర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇంకాస్త దూరం వెళ్తే నేరుగా కృష్ణా నదిలోకి లారీ వెళ్లిపోయేది. అప్పటికే లారీ నది తీరంలోని ఘాట్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా పెను ప్రమాదం తప్పిందని భావించాడు. వెంటనే లారీ టైర్ల కింద రాళ్లను అడ్డుపెట్టి ముందుకు వెళ్లకుండా నిలిపాడు. గ్రామస్థులకు సమాచారం అందించి… జరిగిన విషయం లారీ ఓనర్‌కు చెప్పాడు.


గూగుల్‌ను గుడ్డిగా నమ్ముకుంటే ఇలానే అవుద్దని స్థానికులు లారీ డ్రైవర్ బాషాకు చురకులు అంటించారు. స్థానికుల సహాయంతో లారీలోని బండల లోడ్‌ను మరో లారీలోకి ఎక్కించారు. ఇక జేసీబీ సహాయంతో ఘాట్‌పైన ఉన్న లారీని వెనక్కి లాగి రోడ్డు పైకి ఎక్కించి తిరిగి పంపించేశారు. ఇక నుంచి గుడ్డిగా గూగుల్ మ్యాప్స్‌ను కాకుండా సందేహం ఉన్న చోట స్థానికులను అడిగి తెలుసుకోవాలని జూరాల గ్రామస్థులు లారీ డ్రైవర్ బాషాకు సూచించారు.


గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మితే ఏం జరుగుతుందో వనపర్తి జిల్లా ఆత్మకూరు లారీ డ్రైవర్‌ను అడిగితే తెలుస్తోంది. మ్యాప్ చూపించిన దారిలో వెళ్తే ఏకంగా కృష్ణా నదిలో తేలాడు. గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్లిన బండల లారీ.. దారి తప్పి కృష్ణానదిలో ప్రమాదానికి దారి తప్పింది. ఈ ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని జూరాల గ్రామ శివారులో కృష్ణానది దగ్గర చోటుచేసుకుంది.

కొత్తకోట వరకు వచ్చిన తర్వాత ఆత్మకూరు నుంచి

నేషనల్‌ హైవే మీదుగా కొత్తకోట వరకు వచ్చిన తర్వాత ఆత్మకూర్ నుంచి మక్తల్ వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ సహాయంతో ముందుకు సాగాడు లారీ డ్రైవర్ బాషా. ఈ క్రమంలో ఆత్మకూర్ చౌరస్తా చేరుకునే సరికి తెల్లవారుజాము అయ్యింది. అయితే చౌరస్తాలో టర్న్ తీసుకోవాల్సిన డ్రైవర్… గూగుల్ మ్యాప్ ప్రకారం నేరుగా వెళ్లాడు. అలా జూరాల గ్రామం వైపునకు ప్రయాణించాడు. గ్రామం దాటిన తర్వాత సైతం అలానే ముందుకు సాగాడు. ఇంతలోనే లారీ కుదుపులు ఎక్కువ కావడం… కొంత దూరంలోనే నీరు కనిపిస్తుండడంతో ఏదో అనుమానం కలిగింది. ఒక్కసారిగా లారీ నిలిపి దిగి చూడగా… దెబ్బకు లారీ డ్రైవర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇంకాస్త దూరం వెళ్తే నేరుగా కృష్ణా నదిలోకి లారీ వెళ్లిపోయేది. అప్పటికే లారీ నది తీరంలోని ఘాట్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా పెను ప్రమాదం తప్పిందని భావించాడు. వెంటనే లారీ టైర్ల కింద రాళ్లను అడ్డుపెట్టి ముందుకు వెళ్లకుండా నిలిపాడు. గ్రామస్థులకు సమాచారం అందించి… జరిగిన విషయం లారీ ఓనర్‌కు చెప్పాడు.


లారీ డ్రైవర్‌ ఆత్మకూరు నుంచి వెళ్లే ప్రధాన రహదారి గుండా కాకుండా గూగుల్‌ మ్యాప్‌లో లొకేషన్ చూసుకుంటూ పోవడంతో ఆత్మకూరు నుంచి జూరాల రూట్ కు వెళ్లగా మధ్యలో కృష్ణనది చూసి షాక్ కు గురైన డ్రైవర్ బ్రేక్ తొక్కగా లారీ పుష్కర ఘాట్ లోకి దూసుకెళ్లి ఆగింది. దీంతో పెను ప్రమాదం తప్పడంతో డ్రైవర్ ఊపిరి పిల్చుకున్నాడు..

Tags:    

Similar News