Bhadrachalam: భద్రాచలం వద్ద 32 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం

Bhadrachalam: తెలంగాణ రాష్ట్రంలో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చే వరదనీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉధృతి పెరుగుతోంది.

Update: 2025-07-26 06:10 GMT

Bhadrachalam: భద్రాచలం వద్ద 32 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం

Bhadrachalam: తెలంగాణ రాష్ట్రంలో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చే వరదనీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉధృతి పెరుగుతోంది. శనివారం ఉదయం 7 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 32.5 అడుగులు దాటింది.

నీటిమట్టం పెరుగుతున్న కారణంగా భద్రాచలం స్నానఘట్టాల వద్ద ఉన్న మెట్లు వరదనీటిలో మునిగిపోయాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా వరద నీరు వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంది.

దుమ్ముగూడెం మండలం పర్ణశాల ప్రాంతంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన నార చీరల వద్దకు వరదనీరు చేరింది. భద్రతా దృష్ట్యా పర్యాటకులను అక్కడికి వెళ్లకుండా నిలిపివేశారు.

ఇక చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరుతోంది. దీనివల్ల జలాశయం పూర్తిగా నిండిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

భద్రాచలం పట్టణాన్ని వరద ప్రభావం నుండి కాపాడేందుకు అధికారులు ఇప్పటికే స్లూయిజ్‌ల వద్ద మోటార్లను ఏర్పాటు చేశారు. దీంతో పట్టణంలోకి వరదనీరు ప్రవేశించే అవకాశం తక్కువగా ఉందని సమాచారం.

Tags:    

Similar News