మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం అన్యాయం
మతం ఆధారం చేసుకొని భారతదేశంలో పౌరసత్వాన్ని నిర్ధారించడం అన్యాయమని, దీనిని ముక్తకంఠంతో తామంతా వ్యతిరేకిస్తున్నామని, ఖానాపూర్ ముస్లిం జేఏసీ, అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ నంది రామన్న అన్నారు.
ఖానాపూర్: మతం ఆధారం చేసుకొని భారతదేశంలో పౌరసత్వాన్ని నిర్ధారించడం అన్యాయమని, దీనిని ముక్తకంఠంతో తామంతా వ్యతిరేకిస్తున్నామని, ఖానాపూర్ ముస్లిం జేఏసీ, అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ నంది రామన్న అన్నారు. శనివారం స్థానిక ఏఎంకె ఫంక్షన్ హాల్ లో ముస్లిం జేఏసీ, తరఫున ఏర్పాటుచేసిన ఎం ఎన్.ఆర్.సి, సిసిఏ, వ్యతిరేక అఖిలపక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా దేశంలో మతాన్ని ఆధారంగా చేసుకుని పౌరసత్వం నిర్ణయించడం సరైంది కాదని పేర్కొంటూ తామంతా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో ముందుగా పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. పౌరసత్వం నిరూపించుకునేందుకు దేశంలోని పౌరులందరూ పనీపాటా వదిలేసుకుని 1971 కన్నా ముందు ఉన్నటువంటి రికార్డుల కొరకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుందని ఈ చర్య హేయమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు అందరూ పాల్గొన్నారు. అనంతరం అఖిలపక్ష జేఏసీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ ఎన్నికలో కన్వీనర్ గా నంది రామయ్య, కో కన్వీనర్ గా ఆకుల శ్రీనివాస్, సభ్యులుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి బక్క శెట్టి కిషోర్, రాము నాయక్, శ్రీనివాస్, రాజేందర్ గౌడ్, రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీపీ మోహిత, దయానంద్, మడగల గంగాధర్, ప్రదీప్, మజీద్, తెలంగాణ జన సమితి నుంచి తిలక్ రావు, ఎంఐఎం పార్టీ నుంచి అబ్దుల్ అలీ బాబా, అంబేద్కర్ సంఘం నుంచి శంకర్, దాసరి రాజన్న, సునారికారి రాజేష్, కమలాకర్, రాకేష్, మురళి, షబ్బీర్ భాష, నజీర్, అహ్మద్, అజయ్, మౌలానా, తదితరులు పాల్గొన్నారు.