GHMC Elections 2020: మొదలైన ఓట్ల లెక్కింపు.. సాయంత్రానికి ఫలితాలు వచ్చే అవకాశం!

అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లో తెలనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.

Update: 2020-12-04 03:38 GMT

గ్రేటర్ వార్ చివరి దశ మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ పీఠం ఎవరి సొంతం కానుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. మొత్తం 150 వార్డుల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ లో భాగంగా మొదట పోస్టల్ బబ్యాలెట్లను లెక్కిస్తున్నారు. తరువాత బ్యాలెట్ బాక్స్ లు ఓపెన్ చేస్తారు.

మూడు రౌండ్లలో ఫలితం వెలువడేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి సర్కిల్ పరిధిలోనూ వార్డుల సంఖ్యను బట్టి 150 హాల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కోహాల్ లో 14 కౌంటింగ్ టేబుల్స్ మీద కౌంటింగ్ జరుగుతోంది.

మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ లు వచ్చాయి. వాటి లెక్కింపు జరుగుతోంది. తొలి రౌండ్ ఫలితం ఉదయం 11 గంటల తరువాత వచ్చే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ 1 వ తేదీన నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు హోరా హోరీగా తలపడ్డాయి. మొత్తం 150 వార్డులలో 1,122 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. జీహెచ్ఎంసి పరిధిలోని 74,67,256 ఓట్లకు గాను 34,50,331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

Tags:    

Similar News