Ganja Smuggling in Karimnagar : మత్తులో పడి జీవితాలు పాడు చేసుకుంటున్న యువత

Update: 2020-07-06 05:54 GMT

Ganja Smuggling in Karimnagar : తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటోంది. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వెయ్యటానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గంజాయి మాత్రం ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతుంది. విద్యార్థులను టార్గెట్ చేసుకుని స్మగ్లింగ్ ముఠాలు గంజాయి విక్రయిస్తున్నారు. గంజాయి పీల్చడమే కాదు కొందరు విద్యార్థులు అమ్మకాలు కూడా చేస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్‌లో గంజాయి మాఫియా తన అక్రమదందాను విస్తరిస్తున్నది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉండే సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా యువతకి ఇదోక ఆర్థిక వనరుగా మారిపోయింది. గుట్టు చప్పడు కాకుండా అటవీ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలోకి గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నారు.

ఇక జగిత్యాల జిల్లాలో రాయకల్ మండల లో పెద్ద ఎత్తున గంజాయి సరఫర జరుగుతున్నట్లు తెలుస్తోంది. పది ఇరవై గ్రాముల చొప్పును అమ్మేవాళ్లు కొందరైయితే లిక్విడ్ గా మార్చీ అమ్మేవాళ్లు మరికొందరు లాక్ డౌన్ సమయంలో కొందరు కేటుగాళ్లు జగిత్యాల జిల్లాలో గంజాయిని ఆర్థిక వనరుగా మార్చుకున్నారు. జిల్లాల నుంచి అటవీ మార్గం ద్వారా రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో విక్రయిస్తున్నారు. అయితే ఇంతా జరుగుతున్న పోలీసులు సరిగ్గా నిఘా పెట్టడంలేదని విమర్శలు వస్తున్నాయి.

ఇక సిరిసిల్ల జిల్లాలో కూడా గంజాయి సరఫరా ఎక్కువగా జరగుతుందని సమాచారం. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇద్దరు యువకులతో పాటుగా, మరో ముగ్గురు స్థానికంగా గంజాయి విక్రయాలు చేస్తున్నట్టు పోలీసుల నిఘాలో తేలింది. వేములావాడలోనూ గంజాయి విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయిని లిక్విడ్ గా మార్చి గ్రాము ధర ఐదు వందల రూపాయలుగా అమ్ముతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. మొదట ఉచితంగానే ఇచ్చి మెళ్లిగా అలవాటు చేయిస్తున్నారనే విమర్శలు వినపడుతున్నాయి హుక్కా పరికరంతో గంజాయిని సేవిస్తున్నట్టు సమాచారం. హుక్కా పరికరాలు కూడా సిరిసిల్లకి ఎలా వస్తున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.

గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వెయ్యటానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గంజాయి మాత్రం ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతుంది. విద్యార్థులను టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయిస్తున్న గంజాయి స్మగ్లింగ్ ముఠాలు, గంజాయి అక్రమ రవాణాకు సైతం విద్యార్థులనే ప్రోత్సహిస్తున్నారు. ఇకనైనా అధికారులు దృష్టి సారించి యువత పక్కదారి పట్టకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Tags:    

Similar News