Gadwal: ఫుడ్ పాయిజన్‌తో 15 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం!
Gadwal: గద్వాల జిల్లాలోని ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. సుమారు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు.
Gadwal: ఫుడ్ పాయిజన్‌తో 15 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం!
Gadwal: గద్వాల జిల్లాలోని ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. సుమారు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను స్కూల్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. హాస్టల్‌లో కొంతమంది విద్యార్థు ఉప్మా తినగా మరికొందరికి అరటి పండ్లు, బిస్కెట్లు ఇచ్చానని హాస్టల్ వార్డెన్ తెలిపాడు. కానీ ఉప్మాలో పురుగులు రావటంతోనే తమకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని విద్యార్థులు తెలిపారు.