తన గ్రామ ప్రజలకు ఓ సర్పంచ్ ఏం పంపిణీ చేసాడో తెలుసా...

లాక్ డౌన్ నేపథ్యంలో కొంత మంది అధికారులు, గ్రామ పెద్దలు, స్వచ్చంధ సంస్థలు, ఇలా ఎంతో మంది గ్రామ ప్రజలకు అలాగే పట్టణాల్లో ఉండే పేదలకు, వలస కూలీలకు నిత్యావసర వస్థువులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2020-04-26 04:40 GMT

లాక్ డౌన్ నేపథ్యంలో కొంత మంది అధికారులు, గ్రామ పెద్దలు, స్వచ్చంధ సంస్థలు, ఇలా ఎంతో మంది గ్రామ ప్రజలకు అలాగే పట్టణాల్లో ఉండే పేదలకు, వలస కూలీలకు నిత్యావసర వస్థువులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.కానీ ఓ గ్రామంలో మాత్రం గ్రామ సర్పంచ్, వారి కుమారుడు ఓ వినూత్న ప్రయత్నం చేసారు. గ్రామస్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంటికి ఓ కోడి, పది గుడ్లు పంపిణీ చేసారు.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం గుంతపల్లి సర్పంచ్‌ పడమటి సుమిత్ర కుమారుడు అనంతరెడ్డి ఈ పనికి శ్రీకారం చుట్టారు. లాక్ డౌన్ నేపథ్యంలో తమ గ్రామ ప్రజలు ఎవరూ ఇబ్బందులను ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో గ్రామ ప్రజలకు నిత్యావసర వస్తువలును అందజేయాలని నిర్ణయించుకున్నాడు. గ్రామంలో సుమారుగా 450 కుటుంబాలు ఉన్నప్పటికీ ఖర్చుకు వెనకాడకుండా దాదాపుగా రూ.5 లక్షలను ఖర్చు చేసి గ్రామప్రజలు బయటకి రాకుండా వారికి నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేసాడు.

అంతే కాదు తమ గ్రమాస్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి రోగ నిరోధక శక్తిపెరిగేందుకు ప్రతి ఇంటికి ఒక కోడి, పది కోడిగుడ్లను ఉచితంగా అందజేశారు. వాటితో పాటుగానే శానిటైజర్లు, మాస్కులను అందజేసి ఉదారత చాటుకున్నారు. దీంతో గ్రామ ప్రజలు తమ సర్పంచ్ ను కొనియాడుతున్నారు. ప్రతి గ్రామానికి ఇలాంటి సర్పంచ్ ఉంటే ఎంత బాగుంటుందో కదూ..

Tags:    

Similar News