TS News: ప్రభుత్వ విప్‌లుగా నలుగురి నియామకం
TS News: ప్రభుత్వ విప్‌లను నియమించిన తెలంగాణ ప్రభుత్వం
TS News: ప్రభుత్వ విప్‌లుగా నలుగురి నియామకం
TS News: తెలంగాణ ప్రభుత్వం విప్‌లను నియమించింది. విప్‌లుగా ప్రభుత్వం నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ విప్‌లుగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ను ప్రభుత్వం నియమించింది. చీఫ్ విప్‌గా మల్‌రెడ్డి రంగారెడ్డి, వివేక్, వేముల వీరేశం పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తుంది.