మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ కవిత

టీఆర్ఎస్ నాయకురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తన దయాహృదయ్యాన్ని ప్రజలకు చాటింది.

Update: 2020-03-19 14:34 GMT
Former MP Kavitha

టీఆర్ఎస్ నాయకురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తన దయాహృదయ్యాన్ని ప్రజలకు చాటింది. ఆరోగ్య సమస్యలతో కంటిచూపు మందగించిన ఓ గిరిజన బాలికకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. తనకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. పూర్తివివరాల్లోకెళితే ఆర్మూరు నియోజకవర్గం మాక్లూరులో నందిని అనే ఓ బాలిక తన తల్లితో నివాసం ఉంటుంది. ఆ బాలిక తండ్రి తన చిన్నతనంలోనే చనిపోగా అప్పటి నుంచి తల్లి మానసిక వ్యాధితో బాధపడుతుంది. ఈ బాలిక ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది.

బాలికకు షుగర్‌, థైరాయిడ్‌ ఉండడంతో ఆమె ఆరోగ్య పరిస్తితి క్షీణిస్తుంది. రోజు రోజుకు షుగర్ లెవల్ పెరిగిపోవడంతో నందినికి కంటిచూపు క్రమంగా మందగిచింది. అయినా నందిని పట్టు వదలకుండా చదువును కొనసాగిస్తుంది. మాక్లూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తరగతిలో అందరికంటే ముందంజలో నిలుస్తుంది. చదువులో మాత్రమే కాదు మంచి పెయింటర్‌గా ఎన్నో బహుమతులను కూడా సాధించింది. కానీ నందిని చూపు మందగించడంతో నిత్యం ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ తీసుకుంటూ కాలం గడుపుతుంది. ఈ విషయం తెలుసుకున్న మహిళా నేత కల్వకుంట్ల కవిత ఆ బాలికను కలిసింది. ఆమెకు అన్ని విధాలుగా సహాయ పడతా నంటూ భరోసా నిచ్చింది. నందినికి మెరుగైన చికిత్స అందించేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలోనే బాలికను కవిత చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మెరుగైన కంటి చికిత్సను చేయించారు. అనంతరం బాలికను ఇంటికి పంపించారు. కాగా ఈ రోజున నందిని సంపూర్ణ ఆరగ్యంతో, ఎంతో ఉత్సాహంతో పదో తరగతి పరీక్షలు రాయడానికి వెల్లింది. కాగా ఆ రోజున పరీక్ష రాయడానికి వెలుతున్న నందినిని ఈ రోజు కలిసి సారు. బాలికకు అభినందనలు తెలిపి ఉత్సాహాన్ని నింపారు. నందినికి ఎలాంటి సమస్య కలిగినా తనకు సమాచారం ఇవ్వాలని బాలిక బంధువులకు, ఉపాధ్యాయులకు సూచించింది.


Tags:    

Similar News