ఉద్యోగంలోకి రీఎంట్రీపై రెస్పాండ్ అయిన మాజీ డీఎస్పీ నళిని
సీఎం ఆదేశాలపై రెస్పాండ్ అయిన మాజీ డీఎస్పీ నళిని
ఉద్యోగంలోకి రీఎంట్రీపై రెస్పాండ్ అయిన మాజీ డీఎస్పీ నళిని
Former DSP Nalini: మాజీ పోలీస్ ఆఫీసర్ నళినిని ఉద్యోగంలో చేర్చాలంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలపై ఆమె రెస్పాండ్ అయ్యారు. ఈ సందర్భంగా తనపై చూపించిన కన్సర్న్ పట్ల సీఎంకు థ్యాంక్స్ నళిని తెలిపారు. పన్నెండేళ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ మూలాల కల.. ఒక సీఎంగా మీరు నా అంశాన్ని పూడ్చిన శవాన్ని వెలికితీసినట్లు చేస్తున్నారు. అయితే ఆ మరణానాకి కారణం తెలుసుకోవాలని అనుకుంటున్నందుకు థ్యాంక్స్ అంటూ సోషల్‌మీడియాలో వివరణతో కూడిన లెటర్‌ను రిలీజ్ చేశారు నళిని.
తన పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకునేలా ఒక అటెన్షన్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో తాను కూడా ముందు వరుసలో ఉన్నానన్న విషయం మీ ద్వారా ప్రజలకు అర్థమయినందుకు ధన్యవాదాలు అంటూ పోస్టు పెట్టారు. అయితే తాను ఇప్పుడు ఉద్యోగం చేసేందుకు సుముఖంగా లేనంటూ సోషల్‌మీడియాలో ఓ పోస్టు పెట్టారు.