నల్లగొండ జిల్లా చిన్న నారాయణపురంలో రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీల చిచ్చు
నల్లగొండ జిల్లా చిన్న నారాయణపురంలో రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీల చిచ్చు సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి ఒకరైతే.. మరొకరు ఫ్లెక్సీలు వేసుకున్న వైనం
నల్లగొండ జిల్లా చిన్న నారాయణపురంలో రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీల చిచ్చు
నల్లగొండ జిల్లా చిన్న నారాయణపురంలో ఫ్లెక్సీల వ్యవహారం రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి ఒకరైతే.. ఫ్లెక్సీలు మరొకరు వేసుకున్నారు. పంచాయతీ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు వెంటనే రీకౌంటింగ్ చేపట్టారు. ఈ ఉత్కంఠ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి మెరుగు అనిత సత్తయ్య కేవలం రెండు ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు.అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఒకవైపు అధికారికంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించినా.. ప్రమాణ స్వీకారానికి ముందే ఊరంతా ఫ్లెక్సీలు వెలిశాయి. "నేనే సర్పంచ్" అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి జంగిలి అనిత మల్లికార్జున్ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు మండలంలో చర్చనీయాంశంగా మారింది. . గెలిచిన అభ్యర్థి ఒకరు.. ఫ్లెక్సీలు వేసింది మరొకరు కావడంతో గ్రామస్థులు విస్తుపోతున్నారు.