ఎల్బీ నగర్ లో అగ్ని ప్రమాదం

Update: 2019-04-21 14:53 GMT

హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ రింగ్ రోడ్డులోని కూలర్ల గౌడన్ లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో కూలర్లు దగ్ధమయ్యాయి.షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Similar News