గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Update: 2019-08-08 14:02 GMT

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవిచినట్లుగా సమాచారం. గురువారం మధ్యాహ్నం ఆస్పత్రి మూడో అంతస్తులోని చిన్న పిల్లల వార్డులో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో వార్డులోని పలు వైద్య పరికరాలు దగ్ధమైనట్టు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకొని మంటలను అదుపు చేశారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

Tags:    

Similar News