వరంగల్‌ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు

వరంగల్‌ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ పరకాల మండలం లక్ష్మీపురం ఐకేపీ సెంటర్‌ వద్ద ధర్నాకు దిగారు.

Update: 2020-01-07 07:54 GMT

వరంగల్‌ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ పరకాల మండలం లక్ష్మీపురం ఐకేపీ సెంటర్‌ వద్ద ధర్నాకు దిగారు. పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతును తోటి రైతులు అడ్డుకున్నారు. వరి ధాన్యాన్ని కళ్లంలో ఆరవేసి రెండు నెలలు గడుస్తున్నా.... ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులు తీర్చకోలేకపోతున్నామంటూ ఆందోళన చెందుతున్నారు.

నాణ్యత లోపం పేరుతో కొనుగోలుదారులు... క్వింటాలుకు ఐదు నుంచి ఆరు కిలోల వడ్లను తీస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో పండించిన పంటను ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్‌ చేస్తున్నారు.


Full View


Tags:    

Similar News