Khammam: ఎద్దు మూత్ర విసర్జన చేసిందని యజమానికి ఫైన్

* రైతు ఆవేదనపై స్పందించిన కానిస్టేబుల్‌... ఫైన్‌ చెల్లించి రసీదును రైతుకు ఇచ్చిన కానిస్టేబుల్‌

Update: 2022-12-03 09:43 GMT

ఎద్దు మూత్ర విసర్జన చేసిందని యజమానికి ఫైన్

Khammam: తప్పు చేస్తే ఫైన్‌ వేయడం కామన్‌గా జరిగే విషయమే అయితే పశు తప్పు చేస్తే దాని యజమానికి జరిమాన విధించిన ఘటన ఖమ్మం జిల్లా ఇల్లందులో చోటుచేసుకుంది. ఎడ్ల బండి సాయంతో మట్టి ఇసుక తరలించే సుందర్‌లాల్‌ అనే వ్యక్తికి చెందిన ఎద్దు సింగరేణి జీఎం కార్యాలయం ముందు మూత్ర విసర్జన చేసింది. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎద్దు మూత్రం పోసినందుకు కోర్టు అతనికి జరిమానా విధించింది. ఎద్దును పోషించే స్థోమతే లేని తనకు జరిమానా కట్టే శక్తి లేదని సుందర్‌లాల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన స్థానిక కానిస్టేబుల్ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫైన్ చెల్లించి రసీదును సుందర్ లాల్‌కి అందిచాడు.

Tags:    

Similar News