Sabitha Indra Reddy: మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి అస్వస్థత

Sabitha Indra Reddy: మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. నిన్న గజ్వేల్‌ ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్‌ మీటింగ్‌కు సబిత హాజరయ్యారు.

Update: 2025-03-08 05:21 GMT

Sabitha Indra Reddy: మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి అస్వస్థత

Sabitha Indra Reddy: మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. నిన్న గజ్వేల్‌ ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్‌ మీటింగ్‌కు సబిత హాజరయ్యారు. సమావేశం అనంతరం సబిత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే సబితా ఇంద్రా రెడ్డిని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఆమెకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఫుడ్ పాయిజన్ వల్లే అస్వస్థకు గురైందని నిర్థారించినట్లు సమాచారం.

ఆపై సబితకు చికిత్స అందజేశారు. రాత్రి ప్రథమ చికిత్స అనంతరం కొద్దిసేపు అబ్జర్వేషన్‌లో ఉంచారు వైద్యులు. తరువాత అర్థరాత్రి 12 గంటల సమయంలో ఆరోగ్యం కాస్త మెరుగవడంతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.

Tags:    

Similar News