Exams Postponed: ఓయూ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు అలర్ట్.. ఆ పరీక్షలు వాయిదా
Exams Postponed: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో భీకరంగా వర్షాలు పడుతున్నాయి.తెలంగాణలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. కాలు తీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఉస్మానియా, కాకయతీయ యూనివర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి.
Exams Postponed: ఓయూ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు అలర్ట్.. ఆ పరీక్షలు వాయిదా
Exams Postponed: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓయూ, కాకతీయ యూనివర్సిటీల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సోమవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 3వ తేదీ నుంచిజరగాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. వాయిదా పడిన పరీక్షలపై త్వరలోనే ప్రకటన చేస్తామని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వివరించారు.
భారీ వర్షాల నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జీ వీసీ వాకాటి కరుణ కీలక డెసిషన్ తీసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించారు. కేయూ పరిధిలో సోమవారం జరగాల్సిన థియరీ, ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి తెలిపారు. మంళవారం నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. వాయిదా వేసిన పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని ప్రొఫెసర్ మల్లారెడ్డి వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్య సంస్థలకు సెలవు ప్రకటించింది. చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది. అత్యవసర పని ఉంటేనే బయటకు రావాలని స్పష్టం చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు. ఏ సమస్య వచ్చిన డయల్ 100కు ఫోన్ చేయాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు సూచించారు. వాగులు పొంగిపోర్లుతున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు.