Etela Rajender: బీజేపీలోకి ఈటల రాజేందర్..? ఫాంహౌజ్ వేదికగా..
Etela Rajender: తెలంగాణలో రాజకీయ హైడ్రామా స్టార్ట్ అయ్యింది.
ఈటల రాజేందర్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )
Etela Rajender: తెలంగాణలో రాజకీయ హైడ్రామా స్టార్ట్ అయ్యింది. త్వరలోనే మాజీ మంత్రి ఈటెల బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్‌తో కలిసి ప్రత్యేక విమానంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు. నగర శివారులో బీజేపీ ముఖ్య నేతలతో వీరు రహస్య భేటీ అయినట్లు సమాచారం. మొయినాబాద్‌లోని వివేక్ వెంకటస్వామి ఫామ్‌హౌస్‌లో రహస్యంగా సమావేశమయ్యారు.
ఈ భేటీలో జితేందర్ రెడ్డి, వివేక్, డీకే అరుణ సహా మరో మాజీ ఎంపీ, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. ఆదివారం ఈటల జితేందర్ రెడ్డితో భేటీ అయినట్లు తెలుస్తోంది. భేటీ తర్వాత బండి సంజయ్‌తో జితేందర్ రెడ్డి గండిపేట్ ఫామ్‌హౌస్‌లో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక బీజేపీ జాతీయ నేత హామీతో ఈటలను బీజేపీలో చేర్చుకునేందుకు చర్చ జరుగుతోంది. ఇక జాతీయ పార్టీ హామీ ఓకే అయితే ఈటెల బీజేపీలో చేరే అవకాశం ఉంది.