Etela Rajender: పార్టీ మారే ఉద్ధేశమే లేదు
Etela Rajender: తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యం
Etela Rajender: పార్టీ మారే ఉద్ధేశమే లేదు
Etela Rajender: తెలంగాణలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో బీజేపీలో కీలక నేతలు ఈటెల రాజేందర్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. పార్టీ మార్పు దాదాపు ఖాయమన్న తరుణంలో బీజేపీ అధిష్టానం మంత్ర దండాన్ని ప్రయోగించింది. దీంతో ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ చేరుకుని బిజెపి పెద్దలతో సంప్రదింపులు జరిపారు. పార్టీ మారే ఉద్ధేశమే లేదని, తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. తెలంగాణలో బిజెపి రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సూచనలు సలహాలు ఇచ్చామని ఈటెల రాజేందర్, కోమటి రెడ్డి రాజగోపాల్ పేర్కొన్నారు.