ప్రభుత్వ ఆస్పత్రిలో జడ్జి ప్రసవం.. అభినందించిన మంత్రి ఎర్రబెల్లి..

* సామాన్య మహిళలా ప్రభుత్వాస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి

Update: 2022-12-16 05:48 GMT

జిల్లా జడ్జి షాలినిని అభినందించిన ఎర్రబెల్లి, దాస్యం వినయ్ భాస్కర్

Warangal: ఆర్మూర్ జిల్లా న్యాయమూర్తి షాలిని హనుమకొండ ప్రసూతి ఆస్పత్రిలో ప్రసవించి అందరికి ఆదర్శంగా నిలిచింది. వరంగల్ జిల్లా పాపయ్యపేట చమన్ ప్రాంతానికి చెందిన రాచర్ల షాలిని ఆర్మూర్ జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. షాలిని భర్త ప్రశాంత్ హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన ఓ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జడ్జి షాలినికి పురిటి నొప్పులు రావడంతో హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

సామాన్య మహిళ లాగానే వెళ్లిన న్యాయమూర్తి షాలినికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. శస్త్రచికిత్స ద్వారా ఆమెకు ప్రసవం చేశారు. షాలిని ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించేందుకే తాను ఇక్కడ ప్రసవం చేయించుకున్నానని జడ్జి షాలిని తెలిపారు. ప్రభుత్వం ఆస్పత్రిలో ప్రసవం చేయించుకున్న షాలినిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అభినందించారు.

Full View
Tags:    

Similar News