నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
హుజూర్నగర్ ఉపఎన్నికలో నేటితో నామినేషన్లకు తెరపడనుంది. చివరి రోజు ప్రధాన పార్టీలైనా టీఆరఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అక్టోబర్ 21న ఎన్నికల జరగనుండగా, 24న తుది ఫలితాలు వెలువడనున్నాయి.
హుజూర్నగర్ ఉపఎన్నికలో నేటితో నామినేషన్లకు తెరపడనుంది. చివరి రోజు ప్రధాన పార్టీలైనా టీఆరఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అక్టోబర్ 21న ఎన్నికల జరగనుండగా, 24న తుది ఫలితాలు వెలువడనున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్‌కు మంత్రులు హాజరు కానున్నారు. కాంగ్రెస్ అభర్థి పద్మావతి నామినేషన్‌కు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపాటు కాంగ్రెస్ నాయకులు హాజరుకానున్నారు. జీజేపీ అభ్యర్థి కోటా రామారావు నామినేషన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరైయ్యే అవకాశం ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ర్యాలీగా వచ్చి నామినేషన్ వేసే అవకాశం ఉంది. అయితే ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.