Egg Prices: ఆకాశాన్ని అంటుతున్న కోడిగుడ్ల ధరలు

Egg Rates in Telangana: తెలంగాణలో కోడిగుడ్డు ధరలు కొండెక్కాయి. ఒక్కసారిగా గుడ్డు ధర ఆకాశాన్ని అంటడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2023-01-25 04:24 GMT

Egg Prices: ఆకాశాన్ని అంటుతున్న కోడిగుడ్ల ధరలు

Egg Rates in Telangana: తెలంగాణలో కోడిగుడ్డు ధరలు కొండెక్కాయి. ఒక్కసారిగా గుడ్డు ధర ఆకాశాన్ని అంటడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా తర్వాత గుడ్ల వినియోగం పెరిగింది. దీంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి కోడిగుడ్డు ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి కోసం ప్రజలందరూ రోజుకో గుడ్డు తినడం అలవాటు చేసుకున్నారు. మంచి ఆహారం తిస్కోవాలనే ఉద్దేశ్యంతో చాలా మంది గుడ్డు పై దృష్టి పెట్టారు. దీంతో గుడ్డు ధర గుభేల్ పుట్టిస్తుంది. ఓ వైపు వినియోగం పెరిగిపోవడంతో, అదే స్థాయిలో ఉత్పత్తి లేకపోవడం తో ధరలు రోజు రోజు కు పెరిపోతున్నాయి.

హోల్ సేల్ ధరలు ఎలా ఉన్నా, రిటైల్ వ్యాపారులు మాత్రం ఇష్టారీతిన ధరలు పెంచి అమ్ముతున్నారు. హోల్సేల్ లో గుడ్డు ధర 5 రూపాయల 35 పైసలు పలుకుతోంది. కొన్ని చోట్ల ఆరు రూపాయల 50 పైసలకు కూడా అమ్ముకుంటున్నారు. రిటైల్ లో మాత్రం 7 లేదా 8 రూపాయలకు అమ్ముతున్నారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం ప్రతి మనిషి సంవత్సరానికి 180 గుడ్లు తినాలని సిఫారసు చేసింది. కాబట్టి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోటీన్స్ అందిస్తాయి. అయితే ఒక్కసారిగా గుడ్డు ధర ఆకాశాన్ని అంటడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలు ఎంత పెరిగినా ఆరోగ్య రీత్యా రోగ నిరోధక శక్తి కోసం కొనుగోలు చేసుకోవాల్సిందని ప్రజలు చెప్తున్నారు.

Tags:    

Similar News