ESI స్కామ్‌లో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ
ED: రూ.211 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ
ESI స్కామ్‌లో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ
ED: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాంపై ఈడీ చార్జీషీట్ దాఖలు చేసింది. 211 కోట్ల రూపాయల స్కాం జరిగిందని ఈడీ అధికారులు నిర్ధారించారు. ఈఎస్ఐ స్కాంలో మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఏడుగురు ఉద్యోగుల పాత్రను అధికారులు ప్రస్తావించారు. ఈఎస్ఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోలులో గోల్ మాల్ జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో ఇప్పటికే నిందితులకు చెందిన 144 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి,ఇతర అధికారులతో కుమ్మక్కై స్కాంకు పాల్పడినట్టుగా చార్జీషీట్ లో ఈడీ అధికారులు ప్రస్తావించారు. ఈఎస్ఐ కు మందులు, మెడికల్ పరికరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని ఈడీ ఆరోపణలు చేసింది. అంతేకాకుండా బినామీ కంపెనీల పేరుతో మందులు, మెడికల్ పరికరాలు సరఫరా చేశారని తేల్చింది. మమందులు, మెడికల్ పరికరాల ధరలను మార్కెట్ ధర కంటే ఎక్కువగా కోడ్ చేసినట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఛార్జీషీట్‌లో ఈడీ ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఐఎంఎస్ జాయింట్ డైరెక్టర్ గా గతంలో పనిచేసిన డాక్టర్ పద్మ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి మందులు సరఫరా చేసినట్టుగా తప్పుడు బిల్లులు సృష్టించినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ఈడీ చార్జీషీట్ లో ప్రస్తావించింది.
ఈఎస్ఐ స్కాంలో అవకతవకలకు పాల్పడిన నిధులతో దేవికా రాణితో పాటు ఇతర ఉద్యోగులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్టుగా దర్యాప్తు సంస్థలు తేల్చాయి. దేవికారాణితో పాటు ఫార్మసిస్ట్ నాగలక్ష్మి 6. కోట్ల 30లక్షల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారని ఈడీ గుర్తించింది. 2015-16, 2018-19 మధ్యకాలంలో ఈ కుంభకోణం జరిగిందని ఈడీ అధికారులు చార్జీషీట్‌లో వెల్లడించారు. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే కోణంలో ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఈ ఎస్ ఐ స్కాంలో పెద్దయెత్తున హవాలా మనీ లాటరీ జరిగిందని జరిగిందని ..మాజీ డైరక్టర్ తో పాటు ఉన్నతాధికారులకు హవాలా రూపంలో నిధులు బదిలీ చేశారని ఈడీ తెలిపింది. ..నిందితులు నగలు, ఆస్తులను కూడబెట్టారని ఈడీ చార్జ్ షీట్ లో వెల్లడించింది.