Monsoon Alert: ముందుగానే రుతుపవనాలు..నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Update: 2025-05-14 00:37 GMT

Heavy Rain: తీరం దాటిన వాయుగుండం..తెలుగు రాష్ట్రాలకు వర్ష గండం

Monsoon Alert: భారత వాతావరణ శాఖ శుభవార్త వినిపించింది. ముందుగా అంచనా వేసినట్లుగానే..అండమాన్ తీరాన్ని నైరుతీ రుతుపవనాలు తాకాయి. ఈనెలాఖరులోపు అంటే మే 27వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది. ఓ నాలుగు రోజుల ముందుగానే నైరుతీ రుతుపవనాలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మన తెలుగు రాష్ట్రాల్లోకి కూడా రుతుపవనాలు త్వరగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ సారి ఏపీ, తెలంగాణలో కుండపోత వర్షాలు కురవడం ఖాయంగా కనిపిస్తోంది.

వాతావరణ శాఖ తెలిపిన తాజా బులిటెన్ ప్రకారం ఏపీ, తెలంగాణ, యానాం, కోస్తాంధ్ర,రాయలసీమలో 17వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువయన్న్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయి. గాలి వేగం గంటకు 30 నుంచి 50కిలోమీటర్ల ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 14, 15 తేదీల్లో తెలంగాణలో గాలివేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు.ఒక్కోసారి గంటకు 70కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. పిడుగులు కూడా పడతాయని ఐఎండీ చెప్పింది. ఇదే పరిస్థితి ఏపీలో నేడు ఉంటుందని తెలిపింది. ఇక 14, 15 తేదీల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు తెలంగాణలో అక్కడక్కడా వడగళ్లవాన కూడా పడుతుందని తెలిపింది.

నేడు తెలంగాణలో దట్టమైన మేఘాలు ఉంటాయి. సాయంత్రం 4 తర్వాత నుంచి వర్షాలు చాలా కురిసే అవకాశం ఉంది. రేపు తెల్లవారుజాము వరకు వర్షాలుకురుస్తుంటాయి. కొన్నిచోట్ల భారీగా, కొన్ని చోట్ల మోస్తరుగా వర్షాలు కురుస్తాయి. హైరదరాబాద్ లో నేడు రాత్రికి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అర్థరాత్రి భారీ వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News