పెళ్లి బంధంతో ఒక్కటైన మూగ జంట

ప్రేమిస్తే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలో పరస్పరం ఉన్న లోపాలనూ ప్రేమించగలగాలి. దురదృష్టవశాత్తూ ఇద్దరూ లోపంతో ఉన్న వారైతే.. వారిద్దరూ ప్రేమలో పడితే.. వారి బంధం కచ్చితంగా నూరేళ్ళ పంట అవుతుంది. అదే జరిగింది.. రెండు మూగమనసులు ప్రేమతో పలకరించుకుని పెళ్ళితో ఒక్కటిగా నిలిచాయి.

Update: 2019-10-17 08:05 GMT

ప్రేమ అనేది ఆస్తి, అందం, అంతస్తులతో కలిగేది కాదు. అది ఎప్పుడు, ఎక్కడ, ఎవరిపైన కలుగుతుందో తెలియదు. ఒకరికి ఒకరంటూ బాసలు చేసుకుని ఒకరి కష్టంలో ఒకరు తోడుగా నిలిచేదే ప్రేమ.. వారివురూ మూగ వారు. అయితేనేం.. అదేమీ వారి ప్రేమకు అడ్డం కాలేదు. పైగా ఇద్దరికీ ఉన్న ఆ చిన్న ఇబ్బందే వారి ప్రేమకు గట్టి పునాదిగా మారింది. అందుకే వారిద్దరూ పెళ్లి చేసుకుని తమ జీవితాన్ని కొత్తదారిలో నడిచేలా చేసుకున్నారు. మహబూబా బాద్ జిల్లాలో జరిగిన ఈ ప్రేమ వివాహం వివరాలిలా ఉన్నాయి. .

హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు కంపెనీలో మండల సురేష్, చినగాని యాదమ్మ కంప్యుటర్ ఆపరేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. సురేష్ చన్న గూడూరు మండల కేంద్రానికి చెందినా వాడు. ఇక యాదమ్మ స్వస్థలం నల్గొండ జిల్లా కనగల్లు మండలం పర్వతగిరి గ్రామం. ఈ ఇద్దరూ మూగవారు. అయితే, వీరు ఒకేచోట పనిచేస్తున్దడంతో.. వీరిరువురి మధ్య స్నేహం బలపడింది. అది ప్రేమగా మారింది. ఒకరికి ఒకరు బాసటగా నిలవాలని బాసలు చేసుకున్నారు. దీంతో వారివురూ మహబూబాబాద్ సబ్ రిజిస్త్రార్ కార్యాలయంలో తమ స్నేహితులు పెద్దల మధ్య వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. సబ్ రిజిస్త్రార్ హరికోట్ల రవి వారిద్దరికీ శుభాకాంక్షలు అందించారు. 

Tags:    

Similar News