Hyderabad: హైదరాబాద్‌ కుషాయిగూడలో డ్రగ్స్ పట్టివేత

Hyderabad: రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న గ్యాంగ్

Update: 2023-10-24 11:51 GMT

Hyderabad: హైదరాబాద్‌ కుషాయిగూడలో డ్రగ్స్ పట్టివేత

Hyderabad: అధికారులు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. భాగ్యనగరాన్ని మాత్రం డ్రగ్స్‌ భయం పట్టి పీడిస్తోంది. హైదరాబాద్‌లో ఎప్పికప్పుడు ఏదోచోట డ్రగ్స్‌ పట్టుబడుతూనే ఉంటున్నాయి. ముఖ్యంతా యువత టార్గెట్‌గా ఈ డ్రగ్స్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. తాజాగా.. కుషాయిగూడలో డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. 100 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు ఎస్వోటీ పోలీసులు. రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు సభ్యుల గల ముఠాను అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకువచ్చి.. హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు.

Tags:    

Similar News