Drugs: హైదరాబాద్‌లో పేట్రేగిపోతున్న డ్రగ్స్ దందా..
Drugs: 8 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Drugs: హైదరాబాద్‌లో పేట్రేగిపోతున్న డ్రగ్స్ దందా..
Drugs: మత్తులో నగర యువత చిత్తవుతుంది. నగరంలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. యువతే లక్ష్యంగా నగరంలో డ్రగ్స్ సరఫరా సాగుతుంది. ఒకప్పుడు ఢిల్లీ, ముంబై, గోవా లాంటి మహా నగరాలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్ కి విస్తరించింది. నగరంలో మాదక ద్రవ్యాలు అనే మాటే వినిపించకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయాలని ఎన్నీ పకడ్బందీ చర్యలు తీసుకున్నా ఏదో ఒక మూల నుంచి మాదకద్రవ్యాలు నగరానికి చేరుకుంటూనే ఉన్నాయి. రాజధాని హైదరాబాద్‌లో మత్తు మాఫియా చెలరేగిపోతూనే ఉంది.
హైదరాబాద్‌లో డ్రగ్స్ ఇష్యూ మరోసారి కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌లో 215 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఓ హోంగార్డు ఈ డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు పోలీసులు.
డ్రగ్స్ సరఫరాలో రాజస్థాన్‌కు చెందిన హోంగార్డు కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు పోలీసులు. పోలీసుల కళ్లుగప్పి ప్రతాప్ శర్మ డ్రగ్స్‌ను వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. హోంగార్డు ప్రతాప్ శర్మ నుంచి డ్రగ్స్ తీసుకొని.. కామారెడ్డి జిల్లాకు చెందిన వీరేందర్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ప్రతాప్ శర్మ హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం అందుకొని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం, పోలీసులు డ్రగ్స్ అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నా.. ఏదో చోట మత్తు పదార్థాల మూలాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలో మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో అర్ధరాత్రి జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవిస్తున్న పలువురు సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. ఇవాళ పట్టుబడిన నిందితులకు వీరితో లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది ఆగస్టు 17న ఓ నైజీరియన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితుడి నుంచి 11 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు జూలై 8న భారీగా కొకైన్ సీజ్ చేశారు. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.