తెలంగాణ పోలీసుల చేతిలో డ్రోన్‌ కెమెరాలు

Update: 2019-11-23 09:23 GMT

ఇప్పటి వరకూ పోలీసులు నేరాలను అరికట్టడం కోసం అనేక రకాల సాంకేతిక పరికారాలను ఉపయోగించే వారు. వీటితో ఎన్నో సమస్యలను, నేరాలను అరికట్టిన పోలీసులకోసం మరో అధునాతన పరికరం అందుబాటులోకి వచ్చింది. నిర్మాణుష్యంమైన ప్రదేశాలలో జరిగే అసాంఘిక సంఘటనలను గురించి తెలుసుకోవడానికి ఈ డ్రోన్ లను ఉపయోగించనున్నారు. ఇప్పటి వరకూ సీసీ కెమెరాల ఆధారంగా చాలా మంది నేరస్తులను పట్టుకున్నారు.

ఈ మేరకు మహబూబాబాద్‌ జిల్లాకు మంజూరైన డ్రోన్‌ కెమెరాను ఎస్పీ కోటిరెడ్డి శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, ధూమమానం చేసే వారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించడంతో పాటు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ కోసం ఈ కెమెరాను ఉపయోగిస్తారని వారు తెలిపారు.



Tags:    

Similar News