సోదరునికి రాఖీ కట్టడానికి 9km నడిచిన బామ్మ
Karimnagar: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
సోదరునికి రాఖీ కట్టడానికి 9km నడిచిన బామ్మ
Karimnagar: అక్క తమ్ముళ్లు, అన్నా చెల్లెలు సంతోషంగా జరుపుకునే పండుగ రాఖీ పండుగ. ఈ పండుగ రోజు ఒకరికొకరు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఇందులో భాగంగానే సోదరునికి రాఖీ కట్టడానికి ఓ బామ్మ 9 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన బామ్మ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లి గ్రామంలో తన సోదరుడి దగ్గరకు వాకింగ్ చేసుకుంటూ వెళ్లి రాఖీ కట్టింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అన్నా, చెల్లెల అనుబంధం అంటే ఇలా ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు.