DK Aruna: ఏబీవీపీ కార్యకర్త ఝాన్సీపై పోలీసుల తీరు సరికాదు
DK Aruna: పోలీసుల తీరుపై సీఎం రేవంత్ స్పందించి చర్యలు తీసుకోవాలి
DK Aruna: ఏబీవీపీ కార్యకర్త ఝాన్సీపై పోలీసుల తీరు సరికాదు
DK Aruna: మహిళల పట్ల పోలీసుల తీరు సరికాదంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైరయ్యారు. ఏబీవీపీ కార్యకర్త ఝాన్సీపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏబీవీపీ మహిళా కార్యకర్తపై హైదరాబాద్ పోలీసులు ప్రవర్తించిన తీరు బాధాకరమన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీరులాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. పోలీసుల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని.. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.