దిశ నిందితులకు జైలులో మటన్ కర్రీతో భోజనం

Update: 2019-12-02 10:34 GMT

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశువైద్యురాలు దిశ అత్యాచార, హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి నిందితులు నలుగురినీ శనివారం సాయంత్రం చర్లపల్లి జైలుకు తీసుకువచ్చారు. జైల్లో నిన్న ఆదివారం వారికి మొదటిరోజు. ఈ నలుగురికి ఆదివారం ఉదయం పులిహోరతో టిఫిన్, మధ్యాహ్నం 250 గ్రాముల భోజనం రాత్రి మటన్ కర్రీతో మరోసారి భోజనం అందించినట్టు వెల్లడించారు. మధ్యలో రెండు సార్లు టీ కూడా అందించారు.

జైలు నిబంధనల ప్రకారం ప్రతి ఆదివారం ఖైదీలకు మాంసం కూరతో భోజనం వడ్డిస్తారు. దాంట్లో భాగంగా నిన్న వీరికి మటన్ కర్రీ అందించారు. జైల్లో కూడా వారిపై దాడి జరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఆయా బ్యారక్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జైల్లోని ఇతర ఖైదీలు దాడి చేసే అవకాశం ఉండటంతో పాటు షాక్‌లో ఉన్న నిందితులు ఆత్మహత్యకు పాల్పడే అవకాశం కూడా ఉందని, అందుకే వారిని 24 గంటలూ పర్యవేక్షిస్తున్నట్లు జైలు అధికారులు ప్రకటించారు.

Tags:    

Similar News