తెలంగాణ సచివాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

Telangana: 3 నెలలుగా జీతాలు రావడంలేదని నిరసన చేపట్టిన కార్మికులు

Update: 2023-12-11 05:26 GMT

తెలంగాణ సచివాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

Telangana: తెలంగాణ సచివాలయం ఎదుట సెక్రటేరియట్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. కాంట్రాక్టర్‌ తమకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఐడీ కార్డులు ఇచ్చి వెళ్లిపోవాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. 20 ఏళ్లకు పైగా పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్నా.. ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తు్న్నారు.

Tags:    

Similar News