చార్మినార్ వద్ద విపక్షాల ధర్నా

Update: 2019-07-06 07:40 GMT

ఇంటర్ తప్పుడు ఫలితాలతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కాంగ్రెస్, టీడీపీ ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు చార్మినార్ సమీపంలో బిక్షాటన చేశారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చార్మినార్ సమీపం వద్దకు వచ్చారు. చార్మినార్ వద్ద ఆకస్మికంగా ప్రతిపక్షాలు ధర్నాకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటలు చేసుకున్నాయి. ప్రతిపక్షాలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ ను పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు, కోదండరామ్ ను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ తీరుపై కోదండరామ్ మండిపడ్డారు.  

Full View

Tags:    

Similar News