శునకం ఎత్తు బంగారం : మొక్కులు చెల్లించుకున్న దంపతులు

సమ్మక్క సారక్క జాతర మొదలవబోతుంది. ఇంకా రెండురోజులే సమయం ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో పొటెత్తి మొక్కులను తీర్చుకుంటున్నారు.

Update: 2020-02-03 12:30 GMT

సమ్మక్క సారక్క జాతర మొదలవబోతుంది. ఇంకా రెండురోజులే సమయం ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో పొటెత్తి మొక్కులను తీర్చుకుంటున్నారు. అమ్మవారికి పసుపు కుంకుమ, చీరలు, గాజులతో నిలువెత్తు బంగారాన్ని కూడా సమర్పిస్తున్నారు. చిన్నా పెద్దా, ఆడామగా అన్నా తేడా లేకుండా కుటుంబంలోని అందరి ఎత్తు బంగారాన్ని కొలిచి మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఇప్పుడు ఇదే నేపథ్యంలో ఓ జంట తాము పెంచుకునే పెంపుడు శునకం ఎత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇది వింటుంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ అది నిజం. ఈ విచిత్రమైన సంఘటన అక్కడ ఉన్న అందరి దృష్టినీ ఆకర్షించింది.

పూర్తివివరాల్లోకెళ్తే పెద్దపల్లి జిల్లాకు చెందిన దంపతులు తాము ఇంట్లో ఓ శునకాన్ని కొద్ది రోజులుగా పెంచుకుంటున్నారు. అది ఒక రోజున కనపడకుండా పోవడంతో ఆ దంపతులు సమ్మక్క సారలమ్మకు మొక్కుకున్నారట. దీంతో ఆ శునకం మళ్లీ ఇంటికి తిరిగి రావడంతో వారు ఈ ఏడాది ఆ దంపతులు కుక్క ఎత్తు బంగారం జోకించి మొక్కులు తీర్చుకున్నారు.


Tags:    

Similar News