Maha Shivratri 2020: వైభవంగా శివరాత్రి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Update: 2020-02-21 02:39 GMT

రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు తెల్లవారు జామునుంచి ప్రారంభం అయ్యాయి. ఈ రోజును పురస్కరించుకుని ముక్కంటి ఆలయాలన్ని భక్తులతో కిటకిట లాడుతున్నాయి. భక్తులంతా ప్రాక:కాల సమయం నుంచే ఆలయాలకు చేరుకుని శివనామ స్మరణలో మునిగిపోయారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన శైవక్షేత్రాలైన శ్రీశైలం మల్లన్న, వేములవాడ రాజన్న ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యతో వచ్చి ఆ గరళ కంఠున్ని దర్శించుకుంటున్నారు. అనంతరం అభిషేక ప్రియుడికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకం చేస్తున్నారు. అంతే కాక ప్రధాన శివాలయాలలో కొన్ని ఈ రోజు స్వామి వారికి ఎంతో ఇష్టమైన పూజలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే శ్రీశైల మల్లన స్వామికి ఈ రోజు సాయంత్రం ప్రభోత్సవం నిర్వహించనుంచనున్నారు. ఆ తరువాత రాత్రి వేళల్లో పాగాలంకరణ, లింగోద్భవకాల మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 12 గంటల సమయంలో శ్రీభ్రమరాంబదేవి-మల్లికార్జునస్వామి వార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు.

ఇక తెలంగాణలో దక్షిన కాశీగా పేరు పొందిన వేములవాడలో కూడా ఘనంగా శివరాత్రి వేడుకుల జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఆ పరమశివున్ని దర్శించుకోవడానికి అక్కడికి తరలివచ్చారు. మరికాసేపట్లో స్వామి వారికి టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం స్వామి వారిక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక సాయంత్రం ఆరు గంటలకు మహాలింగార్చన, రాత్రి 11:30 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు.

ఇక ఈ నేపథ్యంలోనే కాకతీయుల కాలంలో హన్మకొండ నిర్శించిన వేయిస్తంభాల ఆలయంలోని రుద్రేశ్వరస్వామి ఆలయంలో కూడా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంద్భంగా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ప్రతి శైవక్షేత్రంలోను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.




Tags:    

Similar News