ఇంటింటికి జూట్ బ్యాగుల పంపిణీ
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తయారు చేయించిన బ్యాగులను,టిఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు.
కమ్మర్ పల్లి: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తయారు చేయించిన బ్యాగులను, కమ్మర్ పల్లి మండలంలో స్థానిక ఎంపిటిసి సభ్యుడు మైలారం సుధాకర్, ఇతర టిఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగించవద్దని గ్రామస్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.