CM KCR: ప్రగతి భవన్‌లో ఘనంగా దసరా వేడుకలు.. శ‌మీ, వాహ‌న‌, ఆయుధ పూజ‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్

CM KCR: పాలపిట్టను దర్శించుకున్న కేసీఆర్ కుటుంబం

Update: 2023-10-23 11:29 GMT

CM KCR: ప్రగతి భవన్‌లో ఘనంగా దసరా వేడుకలు.. శ‌మీ, వాహ‌న‌, ఆయుధ పూజ‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్

CM KCR: విజయదశమి వేడుకలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం సతీమణి శోభమ్మ, కుమారుడు మంత్రి కెటిఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు పాల్గొన్నారు. అనంతరం శమీపూజ నిర్వహించారు. శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శనం చేసుకున్నారు. అనంతరం సాంప్రదాయ పద్దతిలో వేదపండితులు నిర్వహించిన ఆయుధ పూజలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

Tags:    

Similar News