Police Websites Hacked: సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్‌సైట్లు హ్యాక్
Police Websites Hacked: సైబర్ గాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్‌సైట్లను హ్యాక్ చేశారు.
Police Websites Hacked: సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్‌సైట్లు హ్యాక్
Police Websites Hacked: సైబర్ గాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్‌సైట్లను హ్యాక్ చేశారు. దీంతో.. వారం రోజులుగా రెండు కమిషనరేట్ల పోలీస్ వెబ్‌సైట్లు పనిచేయడం లేదు. పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్ అధికారుల కాంటాక్ట్ నెంబర్లను హ్యాక్ చేశారు సైబర్‌గాళ్లు. సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన రెండు కమిషనరేట్ల ఐటీ టీమ్స్.. వెబ్‌సైట్లలో మాల్వేర్ చొరబడినట్లు అనుమానిస్తున్నాయి.
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పర్యవేక్షణలో పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు.. సైట్ల పునరుద్ధరణ బాధ్యత తమ భుజాన వేసుకున్నారు. మరోసారి హ్యాకింగ్‌కు గురికాకుండా అధునాతన ఫైర్వాల్స్ ఆడిట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్లను అప్డేట్ చేయిస్తున్నాయి ఐటీ టీమ్స్.