హుజూర్‌నగర్ ఉపఎన్నిక బరిలో మేము కుడా ...

సీపీఎం విస్తృతస్థాయిలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు హుజూర్‌నగర్ ఉపఎన్నికలో తాము పోటీ చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.

Update: 2019-09-27 12:52 GMT

హుజూరుహుజూర్‌నగర్ ఉపఎన్నిక  అధికార టీఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో నిమగ్నమైయ్యాయి. అయితే ఉపఎన్నిక బరిలో మరో పార్టీ కూడా తమ అభ్యర్థిని రంగంలో దింపాలని యోచిస్తుంది. సీపీఎం విస్తృతస్థాయిలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు హుజూర్‌నగర్ ఉపఎన్నికలో తాము పోటీ చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. సీపీఐ,జనసమితి, తెలుగుదేశంపార్టీతో చర్చలు జరుపుతున్నామని, అన్ని పార్టీలు కలిసివస్తే అభ్యర్థిని నిలుపుతామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రజల తరపున ప్రశ్నించే గొంతుక లేదని అన్నారు. వామపక్షాలు లేని లోటు అసెంబ్లీలో స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ పెంచి పోషించారని ధ్వజమెత్తారు. బీజేపీ టీఆర్ఎస్ పాలన విధానాలకు వ్యతిరేకంగా ఎన్నికలలో ప్రచారం చేస్తామని తమ్మినేని తెలిపారు. శనివారం అభ్యర్థిని ప్రకటిస్తామని తమ్మినేని వీరభద్రం తెలిపారు.  సీపీఎం కూడా బరిలో దిగితే పోటీ రసవర్తరంగా ఉండే అవకాశం ఉంది

Tags:    

Similar News